తిరుపతి జిల్లా సమగ్ర అభివృద్దే లక్ష్యంగా సర్ణాంధ్ర @ 2047 విజన్ ప్రణాళికలు సిద్ధం చేయాలని తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జేసీ శుభం భన్సల్ స్వర్ణాంధ్ర@ 2047 అమలు పై ప్రజా ప్రతినిధులు, విద్యావేత్తలు, పారిశ్రామికవేత్తలు, రైతు సంఘాలు, వాణిజ్య సంస్థలు, ప్రముఖులు, జిల్లా అధికారులతో ఒక రోజు వర్క్ షాప్ కార్యక్రమాన్ని నిర్వహించారు.