విడాకుల కోసం కోర్టు చుట్టూ తిరిగిన అశోక్, పవిత్ర జంటకు పుత్తూరు సీనియర్ సివిల్ జడ్జి రాఘవేంద్ర కౌన్సెలింగ్ ఇచ్చారు. కల్యాణపురానికి చెందిన అశోక్, తిరుపతికి చెందిన పవిత్ర కొంతకాలం వివాహ జీవితం తర్వాత విభేదాలతో వేరుగా ఉంటున్నారు. శనివారం జాతీయ లోక్అదాలత్ సందర్భంగా కోర్టులోనే పూలదండలు మార్చుకొని తిరిగి ఒక్కటయ్యారు.