తిరుపతి తాజ్ హోటల్ సమావేశ మందిరంలో శుక్రవారం జాతీయ రహదారులు, పర్యాటక, పౌరవిమాన యానం, అటామిక్ ఎనర్జీ, కోల్ శాఖలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ హామీలను రాజ్యసభ అధ్యయన సందర్శన బృందం సమీక్షించింది. ఈ సమీక్షలో సభ్యులు బీరేంద్ర ప్రసాద్ బైశ్య, నీరజ్ డాంగి, బాబుభాయ్ దేశాయ్ తదితరులు, అధికారులు, కెనరా బ్యాంక్ ప్రతినిధులు పాల్గొన్నారు.