విద్యుత్ బిల్లుల వసూళ్ల కేంద్రాలలో ఆదివారం కూడా వినియోగదారుల కోసం సేవలు అందించామని ట్రాన్స్ కో ఎస్ఈ సురేంద్రనాయుడు తిరుపతిలోని ఎస్పీడీసీఎల్ కార్యాలయంలో తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని విద్యుత్ బిల్లుల వసూళ్ల కేంద్రాల్లో 25 వేల మంది వినియోగదారులు చెల్లించారని ఆయన తెలియజేశారు. తద్వారా రూ. 1. 80 కోట్లు వచ్చిందని వివరించారు.