తిరుపతి జిల్లాలో అమలు జరుగుతున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల పట్ల భారత గ్రామీణ అభివృద్ధి శాఖ డిప్యూటీ సెక్రటరీ ఆశిష్ గుప్తా సంతృప్తి వ్యక్తం చేసి పేదలకు నరెగా ఒక గొప్ప వరం అని అన్నారు. జిల్లాలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పనుల అమలు తీరును పరిశీలించుటకు 3రోజుల పర్యటన నిమిత్తం గురువారం విచ్చేసిన వీరు ముందుగా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ ను తిరుపతి కలెక్టరేట్ లో కలిసి సమావేశమయ్యారు.