తిరుపతి ఎస్పీఎం విశ్వ విద్యాలయంలోని ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో.. శుక్రవారం ప్రీ -ఆర్డీ సెలెక్షన్స్ జరిగాయి. ఈ సెలెక్షన్స్ కి రీజనల్ డైరెక్టర్ రామకృష్ణ, సంజయ్ హాజరయ్యారు. వారు మాట్లాడుతూ రిపబ్లిక్ డే పరేడ్ కు వెళ్ళడం మంచి అవకాశమని, దానిని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ ఎంపికకు 58 మంది వాలంటీర్స్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కో ఆర్డినేటర్ ఆచార్య విద్యావతి, ప్రోగ్రామ్ అధికారులు డా.యువశ్రీ, వజీహాభాను, డా.స్వాతి, గాయత్రి పాల్గొన్నారు.