తిరుమలలోని స్థానికుల సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు టిటిడి ఈఓ శ్యామల రావును కోరారు. శనివారం పద్మావతి అతిథిగృహంలో జరిగిన సమావేశంలో, ఆర్బీ సెంటర్ వాసులకు తిరుమలలోనే నివాస సౌకర్యం కల్పించాలని, బాలాజీ నగర్‌లో ఇళ్లకు ష్లాబ్లు వేయించాలన్నారు. తిరుపతి నగరంలోని ఏడు రోడ్ల పునరుద్ధరణ, పారిశుద్ధ్య కార్మికుల నియామకాన్ని టిటిడి చేపట్టాలని సూచించారు.