సూళ్లూరుపేట: కాళంగినదిలో గుర్తు తెలియని మహిళ మృతదేహం కలకలం

77చూసినవారు
సూళ్లూరుపేట: కాళంగినదిలో గుర్తు తెలియని మహిళ మృతదేహం కలకలం
తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలోని హోలీ క్రాస్ స్కూల్ వెనుక ఉన్న కాళంగినదిలో శనివారం గుర్తు తెలియని మహిళ మృతదేహం కలకలం రేపింది. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న సీఐ మురళీకృష్ణ మృతదేహాన్ని పరిశీలించి. వివరాల కోసం సమీప ప్రాంతంలో క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూళ్లూరుపేట వైద్యశాలకు తరలించామని, పోలూరు వీఆర్ఓ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్