తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి

61చూసినవారు
తిరుమల శ్రీవారిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జై మహేశ్వరి సోమవారం వీఐపీ బ్రేక్ సమయంలో దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

సంబంధిత పోస్ట్