తిరుపతి ఎస్వీయూనివర్సిటీ బోధనేతర సిబ్బంది ఎన్నికలు గురువారం జరగనున్నాయి. ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు పోలింగ్ జరగనుంది. 3గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభిస్తారు. రాత్రి లోపు ఫలితాలు వెలువడుతాయి. విశ్వవిద్యాలయ ఆవరణలోని నూతన పరీక్ష కేంద్రం భవనంలో పోలింగ్ ప్రక్రియ జరగనుంది. 15మంది పోటీలో ఉన్నారు. ఇప్పటికే 17మంది సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 470మంది బోధనేతర సిబ్బంది ఓటుహక్కు వినియోగించుకోనున్నారు.