విశ్వవిద్యాలయాలు దేశ ప్రగతికి చిహ్నాలని, మేధావులను సమాజానికి అందించే వేదికలని తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ అన్నారు. శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం70వసంతాల వేడుక శనివారం వర్శిటీలోని సెనేట్ హాల్ వేదికగా జరిగింది. ఎమ్మెల్సీ శ్రీకాంత్ మాట్లాడుతూ తాను ఎస్వీయూ నుంచే ఉన్నత విద్యను అభ్యసించానని, వర్శిటీ వ్యవస్థాపక దినోత్సవానికి ముఖ్య అతిథిగా రావడం సంతోషంగా ఉందన్నారు.