స్పెషల్ సమ్మర్ రివిజన్ -2025లో భాగంగా జిల్లాలోని అన్ని పోలింగ్ స్టేషన్ల రేషనలైజేషన్ జాగ్రత్తగా చేపట్టాలని సంబంధిత అధికారులను తిరుపతి జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లోని విడియో కాన్ఫరెన్స్ హాల్ నందు స్పెషల్ సమ్మర్ రివిజన్ 2025 పై ఈఆర్ఓలు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.