ఒక మంచి సమాజ నిర్మాణంలో గురువుల బాధ్యత ఎనలేనిది అని తిరుపతి జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్, పలువురు ప్రజాప్రతినిధులు అన్నారు. గురువారం తిరుపతిలోని కచ్చపి ఆడిటోరియంలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి గురు పూజోత్సవ కార్యక్రమం ఏర్పాటుతో ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమం నిర్వహించగా కార్యక్రమంలో కలెక్టర్, పలువురు ప్రజా ప్రతినిధులు, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయుల తదితరులు పాల్గొన్నారు.