తిరుమల శ్రీవారి ఆలయంలో 2025 జనవరి 7న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరగనున్న నేపథ్యంలో ఆ రోజున బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్టు టీటీడీ బుధవారం ప్రకటించింది. దీనికి సంబంధించి ముందురోజు ఎలాంటి సిఫార్సు లేఖలను స్వీకరించనని తెలిపింది. అలాగే వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు నిర్వహిస్తున్న క్రమంలో ఆ రోజున ఆలయ శుద్ధి, ప్రత్యేక పూజలు, నైవేద్యాలు సమర్పించిన తరువాత భక్తులకు నేరుగా సర్వదర్శనానికి అనుమతించనున్నట్లు తెలిపింది.