తిరుమల: రేపు చెక్కుల పంపిణీ: టీటీడీ ఛైర్మన్

78చూసినవారు
తిరుమల: రేపు చెక్కుల పంపిణీ: టీటీడీ ఛైర్మన్
తిరుపతి తొక్కిసలాట ఘటన తీవ్ర విచారకరమని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు. తిరుమలలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఘటనలో తప్పు ఎవరిపైనా నెట్టడం లేదని, విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయని వెల్లడించారు. మృతుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తామని, వారి పిల్లలకు చదువులు చెప్పించడంపైనా నిర్ణయం తీసుకుంటామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా పక్కా చర్యలు చేపడతామని ఆయన స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్