తిరుమలలో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ఆదివారం కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు నిర్వహించారు. సుమారు 148 అంగళ్లను తనిఖీ చేసి 40 మంది ఆనాధికారికంగా లైసెన్స్ లేకుండా అంగళ్లు పెట్టుకున్నట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణ, అసాంఘిక కరకలాపాలను నిర్మూలించడమే లక్ష్యంగా కార్డెన్ సెర్చ్ నిర్వహించినట్లు పోలీసులు స్పష్టం చేశారు.