శ్రీనివాసమంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వరస్వామి వార్షిక వసంతోత్సవాలకు టీటీడీ గురువారం తేదీలను ప్రకటించింది. మే 17 నుంచి 19 వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఈ నెల 18న సాయంత్రం 6 నుంచి రాత్రి 7 గంటల వరకు స్వర్ణ రథంపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. ప్రతి రోజు మ.2 నుంచి 4 గంటలకు స్వపన తిరుమంజన, సాయంత్రం ఊంజల్ సేవ, వీధి ఉత్సవం నిర్వహిస్తారు.