తిరుమలలో జులై నెలలో జరిగే గురుపౌర్ణమి (10వ తేదీ), గరుడ పంచమి (29వ తేదీ) పర్వదినాల సందర్భంగా టీటీడీ రెండు సార్లు గరుడ వాహన సేవ నిర్వహించనుంది. ఈ సందర్భంగా శ్రీ మలయప్ప స్వామివారు గరుడ వాహనంపై నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు ఈ సేవ జరగనుంది.