తిరుమల మొదటి ఘాట్ రోడ్డులోని నడకమార్గం చెంత వెలసివున్న శ్రీలక్ష్మీనరసింహస్వామి వారికి శుక్రవారం ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. కార్తీక మాసంలో స్వాతి తిరు నక్షత్రం సందర్భంగా ప్రతి సంవత్సరం ఆలయంలో ప్రత్యేక అభిషేకం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో మూలమూర్తికి పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపులతో అభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో పాల్గొన్నారు.