తిరుమలలో టీటీడీ ట్రస్టులకు భారీగా విరాళాలు అందుతున్నాయి. విజయవాడకు చెందిన ఫార్ట్యూన్ ఫైన్ జ్యూవెలర్స్ అధినేత కోమటి సునీల్, వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు శుక్రవారం రూ.10,50,001 విరాళంగా అందించారు. తాడేపల్లిగూడెం వాసి మాతురు పంచాక్షరి, బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి రూ.10,00,116 విరాళం ఇచ్చారు. ఈ సందర్భంగా తిరుమలలో అదనపు ఈవో వెంకయ్య చౌదరికి వీరు డీడీలు అందజేశారు.