తిరుమలో శ్రీవారికి నైవేద్య విరామ సమయంలో శనివారం ఉదయం మంత్రి పొంగూరు నారాయణ, ఎల్అండ్ ఛైర్మన్ సుబ్రహ్మణ్యన్, మాజీ మంత్రి మోపిదేవి తదితరులు శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయ రంగనాయక మండపంలో టీటీడీ అధికారులు వీరికి స్వాగతం పలికారు. అనంతరం వారికి తీర్థప్రసాదాలు అందజేశారు.