రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత తన కుమారుడు పరిటాల శ్రీరామ్‌తో కలిసి ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. బీజేపీ మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కూడా ఈ రోజు శ్రీవారిని దర్శించుకున్నారు.