డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి తాను ఏదో అన్నట్లు తప్పుడు ప్రచారం జరుగుతోందని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు శుక్రవారం వెల్లడించారు. సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరి కామెంట్స్ కి స్పందించాల్సిన అవసరం లేదనే ఉద్దేశంతోనే నేను మాట్లాడారు. నా వ్యాఖ్యలను పవన్ కు ఆపాదించడం భావ్యం కాదు. మొన్న ఘటన జరిగిన వెంటనే భక్తులు, మృతుల కుటుంబాలకు క్షమాపణ చెప్పాను' అని ఆయన ఎక్స్ లో రాసుకొచ్చారు.