తిరుమల: తలనీలాలు సమర్పించిన పవన్ కల్యాణ్ సతీమణి

పవన్ కల్యాణ్ భార్య అన్నాలెజినోవ్ కొణిదెల ఆదివారం తిరుమలకు వెళ్లారు. సింగపూర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్ కుమారుడు మార్క్ శంకర్ సురక్షితంగా బయటపడటంతో ఆమె స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె శ్రీవారికి తలనీలాలు ఇచ్చారు. సోమవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో ఆమె శ్రీవారిని దర్శించుకుంటారు. టీటీడీ నియమాల ప్రకారం అన్య మతస్థులు తిరుమల వెంకన్న దర్శనానికి వస్తే శ్రీవారిపై నమ్మకం ఉందంటూ తిరుమల తిరుపతి దేవస్థానానికి డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మేరకు అన్నా కొణిదెల గాయత్రి సదనంలో డిక్లరేషన్ పత్రాలపై సైన్ చేశారు.