తిరుమల: త్వరలో టీటీడీకి ఫుడ్‌ సేఫ్టీ విభాగం

64చూసినవారు
తిరుమల: త్వరలో టీటీడీకి ఫుడ్‌ సేఫ్టీ విభాగం
తిరుమలలో భక్తుల ఆహార భద్రత కోసం టీటీడీ ఒక ప్రత్యేకమైన ఫుడ్‌సేఫ్టీ విభాగాన్ని ఏర్పాటు చేయనుంది. భక్తులకు నాణ్యమైన ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా టీటీడీ చర్యలు చేపడుతోంది. తిరుమలలో ఆహారంలో కల్తీని అరికట్టడానికి, నాణ్యతను పెంచడానికి ఈ కొత్త విభాగం పనిచేస్తుంది. సంప్రదాయ ఆహార పదార్థాలను మాత్రమే విక్రయించాలని ఇటీవలే టీటీడీ అధికారులు సూచించారు. ఈ క్రమంలోనే నిరంతర తనిఖీల కోసం టీటీడీకి ప్రత్యేక ఫుడ్‌సేఫ్టీ విభాగాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

సంబంధిత పోస్ట్