తిరుమల శ్రీవారిని ఉడిపిలోని మఠం పీఠాధిపతి శ్రీశ్రీ విద్యస్యనాధ వైభవ తీర్థస్వామిజీ సోమవారం దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా. ఆలయ అధికారులు పట్టువస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.