తిరుమల: ఆ రెండు రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు పూర్తిగా రద్దు

0చూసినవారు
తిరుమల: ఆ రెండు రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు పూర్తిగా రద్దు
తిరుమలలో ఈ ఏడాది ఆణివార ఆస్థానం ఉత్సవం జూలై 16న జరగనుంది. ఈ సందర్భంగా జూలై 15న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నట్లు టిటిడి ప్రకటించింది. ఈ రెండు రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్టు శనివారం స్పష్టం చేసింది. ప్రోటోకాల్ విఐపీలను మినహా ఇతరుల సిఫార్సు లేఖలు స్వీకరించబోమని తెలిపింది. భక్తులు ఈ విషయాన్ని తెలుసుకొని తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని తెలిపింది.

సంబంధిత పోస్ట్