చెప్పులు ధరించి తిరుమలలో శ్రీవారి దర్శనానికి వెళ్తున్న కొందరు భక్తుల ప్రవర్తన వివాదాస్పదంగా మారింది. శనివారం ఉదయం దర్శనానికి వెళ్లే సమయంలో కొందరు చెప్పులు ధరించారు. వీరిని ఆలయ మహాద్వారం వద్ద శ్రీవారి సేవకులు అడ్డుకున్నారు. చెప్పులు తీసివేసిన తర్వాత దర్శనానికి అనుమతించారు. వైకుంఠ క్యూ కాంప్లెక్స్ దాటి మహాద్వారం వద్దకు వచ్చే వరకు ఎవరూ గమనించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి.