రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఉన్న 240 అన్న క్యాంటీన్లతో పాటు, మరో 70 క్యాంటీన్లు ప్రారంభించనున్నట్టు మంత్రి నారాయణ తెలిపారు. శనివారం తిరుపతిలో ఆయన మాట్లాడుతూ.. ఒక్కో వ్యక్తికి రూ.5కే భోజనం అందిస్తూ దాదాపు 2.25 వేల మందికి ఉపశమనం కలిగిస్తున్నాయని తెలిపారు. ఈ సంఖ్యను మరింత పెంచేలా చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇవి ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.