గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కోసం నిధులు కేటాయించాలని 16వ ఆర్థిక సంఘం సభ్యుడు సౌమ్య కంటి ఘోష్‌ను గ్రామీణ, పట్టణ ప్రజాప్రతినిధులు కోరారు. గురువారం తిరుపతిలోని తాజ్ హోటల్‌లో జరిగిన సమావేశంలో శానిటేషన్, తాగునీరు, రహదారులు, డ్రైనేజీ తదితర అంశాలపై ప్రతినిధులు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.