తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని కరకంబాడి రోడ్డు మార్గంలో గల బయో ట్రిమ్ తదితర ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు మరింత మెరుగ్గా చేపట్టాలని ఇంజినీరింగ్, హెల్త్ అధికారులను కమిషనర్ ఎన్. మౌర్య ఆదేశించారు. ఉపాధ్యాయ నగర్ రోడ్డు, బయో ట్రిమ్ తదితర ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు, మురుగు నీటి కాలువల నిర్మాణం పై ఇంజినీరింగ్, హెల్త్, ప్లానింగ్ అధికారులతో శుక్రవారం కమిషనర్ సమావేశం నిర్వహించారు.