తిరుచానూరు శిల్పారామంలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాల్లో భరతనాట్యం ప్రదర్శనలు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నాయి. నాట్యాచార్యులు సౌందరవల్లి గిరిధరణ్ నేతృత్వంలోని చెన్నై తిరునిన్రావూరుకు చెందిన శ్రీ హర్ష నాట్య కేంద్ర చిన్నారులు నృత్యాలు అందించగా, కరతాళ ధ్వనులతో ప్రేక్షకులు ప్రోత్సహించారు. ఏఓ సుధాకర్ కళాకారులను సత్కరించి జ్ఞాపికలు అందజేశారు.