ట్రేడింగ్‌లో ఎక్కువ లాభాలు వస్తాయంటూ నమ్మించి, సైబర్ నేరగాళ్లు టెక్నికల్ ట్రైనర్ నుంచి రూ.34 లక్షలు మోసగించారు. తారకరామనగర్‌కు చెందిన రామరాజు, హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నారు. ఏప్రిల్ 23న అతని ఫోన్‌కు వచ్చిన వాట్సప్ కాల్‌తో ప్రారంభమైంది మోసం. లింక్‌లు పంపించి ట్రేడింగ్ యాప్ ద్వారా రూ.34 లక్షలు పెట్టించి, వాలెట్ లో రూ.1.5 కోట్లు ఉన్నట్లు చూపించారు. డబ్బు తీసుకోవాలంటే మరో రూ.28 లక్షలు చెల్లించాలంటూ వేధించారు. మోసం గుర్తించిన బాధితుడు 1930కు ఫిర్యాదు చేసి, శనివారం రూరల్ పోలీసులకు నివేదించారు.