తిరుపతి నడిబొడ్డున సుమారు 300కోట్లతో సకల సౌకర్యాలతో నిర్మిస్తున్న తుడా టవర్స్ లో ప్లాట్లు కొనుగోలు చేయాలని, సకాలంలో పూర్తి చేసి వినియోగదారులకు అందుబాటులో వుంచుతామని తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ వైస్ చైర్మన్, శుభం భన్సల్ విజ్ఞప్తి చేశారు. శనివారం తుడా టవర్స్ ను సందర్శించి కాంట్రాక్టర్ కెసిపి ప్రాజెక్ట్ లిమిటెడ్, తుడా ఇంజనీర్లకు పలు సూచనలు చేశారు.