తప్పిపోయిన బాలికను వారి బంధువులకు తిరుమల పోలీసులు అప్పగించారు. మంగళవారం మహబూబ్ నగర్ జిల్లా హన్వాడకు చెందిన రవి, వెంకటేశ్వరి కూతురు దివ్య (5) పీఏసీ-3 వద్ద వదిలి పెట్టి తిరుపతికి వెళ్లారు. తిరుపతిలో చిన్నారి లేదని గుర్తించి బస్టాండ్ లోని పోలీసు ఔట్ పోస్ట్ లో ఫిర్యాదు చేశారు. వెంటనే కమాండ్ కంట్రోల్ ద్వారా తిరుమల పోలీసులకు తెలిపగా, వారు చిన్నారిని కుటుంబ సభ్యులకు అప్పగించారు.