ప్రేమకు, కరుణ, త్యాగానికి ప్రతీక, జనుల కొరకు వారి పాపాలను శిలువగా మోసిన దేవ దూత అని, యేసు ప్రభువు ఆశీస్సులు ప్రజలు అందరిపై ఉండాలని, కరుణ, ప్రేమ మార్గం జీసస్ మార్గం అని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అన్నారు. తిరుపతి జిల్లా క్రిస్టియన్, ముస్లిం మైనార్టీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో క్రిస్మస్ హై టీ వేడుకలు తిరుపతి కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం సాయంత్రం నిర్వహించారు.