ఎస్వీ గోశాలలో గోవులు దారుణంగా చనిపోతున్నాయంటూ టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డిచేసిన వ్యాఖ్యలపై టీటీడీ పాలకమండలి సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ అపద్ధపు ఆరోపణలు చేయడం కాదని గోసాల పరిశీలనకు రావాలని కరుణాకర్ రెడ్డికి భానుప్రకాష్ ఛాలెంజ్ విసిరారు. శ్రీవారిని కించపరిచే విధంగా వ్యవహారాలు నడిపిన చరిత్ర కరణాకర్ రెడ్డిది అంటూ మండిపడ్డారు. ఆయన వస్తే అన్ని రికార్డులను చూపిస్తామన్నారు.