పవిత్ర పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానానికి గత మూడు వారాలుగా భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు చివరిదశలో ఉండటంతో దేశం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు. మంగళవారం తెల్లవారుజామున నుంచే కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 18 గంటల సర్వదర్శన సమయం పడుతుంది. సోమవారం 84,258 మంది దర్శించారు.