తిరుపతిలోని ఎమ్మార్‌పల్లిలో అన్నా క్యాంటీన్‌ను కార్పొరేషన్ కమిషనర్ మౌర్య గురువారం తనిఖీ చేశారు. నాణ్యమైన భోజనం నిర్ణీత సమయంలో అందాలన్నారు. రవీంద్రనగర్, కేశవాయనగుంట, టీటీడీ ప్లాట్స్ ప్రాంతాల్లో ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. అభివృద్ధి పనులను పరిశీలించి, క్యాంటీన్ చుట్టుపక్కల శుభ్రతను కల్పించాలన్నారు.