టీటీడీ యాజమాన్యంలో నిర్వహిస్తున్న శ్రీవెంకటేశ్వర గోశాలలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఎక్కువ సంఖ్యలో గోవులు మరణించాయని వస్తున్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు శుక్రవారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. తిరుపతి ఎస్వీ 'గో' సంరక్షణశాలలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా గోవులు మృతి చెందాయా, అనారోగ్యానికి గురయ్యాయా అని వస్తున్న ఆరోపణలపై టీటీడీ విచారణ జరిపించాలన్నారు.