వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో రద్దీ పెరిగింది. మరికాసేపట్లో వైకుంఠ ద్వారదర్శనానికి టోకెన్ తీసుకున్న భక్తులను అనుమతిస్తారు. పదిరోజులపాటు సాగే వైకుంఠద్వార దర్శనాల కోసం వేలాదిగా వస్తున్న భక్తులతో తిరుమల కొండ కిక్కిరిసింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల కొండలు గోవింద నామస్మరణతో మార్మోగుతున్నాయి. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు మలయప్ప స్వామి స్వర్ణరథంపై దర్శనమిస్తారు.