తిరుపతి ఐసర్‌లోని కెమిస్ట్రీ ల్యాబ్‌లో మంగళవారం అకస్మాత్తుగా విద్యుదాఘాతంతో మంటలు చెలరేగాయి. సకాలంలో స్పందించిన అధికారులు విద్యార్థులు, అధ్యాపకులను బయటకు పంపించారు. నిప్పు రసాయనాలను తాకడంతో దట్టమైన పొగ ఏర్పడింది. చిన్నపాటి రసాయనాలు, ఫ్రిజ్‌లు దెబ్బతిన్నాయి. ప్రమాదంపై నిజానిర్ధారణ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు డైరెక్టర్ తెలిపారు.