తరతరాలుగా పేదల అణిచివేత్తలు భాగంగా పాలయగాళ్లకు వ్యతిరేకంగా సాగే పోరాటమే తిరుపతి గంగ జాతర అని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అభివర్ణించారు. తిరుపతిలో ఏవైఎఫ్ జాతీయ మహాసభల ఏర్పాట్ల పర్యవేక్షణలో భాగంగా మంగళవారం తిరుపతికి వచ్చిన సందర్భంగా తిరుపతిలో జరుగుతున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రజలకు ఇష్టమైన గంగ జాతరను తిరుపతి చిన గంగమ్మ గుడిని సందర్శించారు.