తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన మంగళవారం చక్రస్నానం వైభవంగా జరిగింది. ముందుగా ఉదయం పల్లకీపై స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించారు. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం స్వామివారు ఊరేగింపుగా కపిలతీర్థంలోని ఆళ్వార్ తీర్థానికి చేరుకున్నారు. అక్కడ ఉదయం స్నపనతిరుమంజనం అనంతరం వైభవంగా చక్రస్నానం నిర్వహించారు. ఆ తరువాత పి. ఆర్. తోటకు వేంచేశారు.