తిరుపతిలో అన్నమయ్య విగ్రహానికి శాంటాక్లాజ్ టోపీ పెట్టిన అంశం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో సీసీటీవీ ఫుటేజ్ ను బుధవారం చెక్ చేయగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. తిరుపతి ఈస్ట్ పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించగా విగ్రహానికి శాంటాక్లాజ్ టోపీ ఒక వ్యక్తి పెట్టినట్టుగా గుర్తించారు. ఆ వ్యక్తి స్థానిక జంక్షన్ లో పెన్నులు అమ్ముతుంటాడని గుర్తించారు. పోలీసులు చర్యలు తీసుకుంటామని చెప్పారు.