తిరుపతిలో శనివారం జమిలి ఎన్నికలపై నిర్వహించిన మేధావుల సదస్సులో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. జమిలీ ఎన్నికలతో సమయం, ఖర్చు ఆదా అవుతాయని చెప్పారు. రాజకీయ కారణాలతో కొన్ని పార్టీలు జమిలి వద్దంటున్నాయని, ప్రాంతీయ పార్టీలకు నష్టమనే ప్రచారంలో వాస్తవం లేదని తెలిపారు. జమిలి ఎన్నికలపై దేశమంతా చర్చ జరగాలని డిమాండ్ చేశారు.