ఆటోనగర్ లోని వాహనాలు మరమ్మత్తులు చేసే ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్. మౌర్య దుకాణదారులను ఆదేశించారు. బుధవారం ఆటోనగర్ లోని వాహనాలు మరమ్మత్తులు నిర్వహించే ప్రాంతాలను నగరపాలక సంస్థ, ఐలా అధికారులతో కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ప్రధాన ప్రాంతం అయిన ఆటో నగర్ అపరిశుభ్రంగా ఉండకుండా తగు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.