తిరుపతి: అప్పు వసూలు కోసం కిడ్నాప్‌.. ఎంపీటీసీ మృతి

81చూసినవారు
తిరుపతి: అప్పు వసూలు కోసం కిడ్నాప్‌.. ఎంపీటీసీ మృతి
చిత్తూరు జిల్లా పాలసముద్రంలోని నరసింహాపురం ఎంపీటీసీ సభ్యుడు జగన్నాథరాజు కిడ్నాపర్ల చెరలో గుండెపోటుతో మృతి చెందారు. విజయవాడకు చెందిన ఓ ప్రైవేటు ఫైనాన్స్‌ సంస్థ ద్వారా ఎంపీటీసీ వాయిదాల పద్ధతిలో జేసీబీ కొనుగోలు చేశాడు. నెలవారీ వాయిదాల చెల్లింపులో జాప్యం జరగడంతో ఆ సంస్థ నుంచి బెదిరింపులు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో జగన్నాథరాజును ఆ సంస్థ ప్రతినిధులు అపహరించారు. విజయవాడకు వాహనంలో తీసుకెళ్తుండగా గుండెపోటుకు గురై మృతి చెందాడు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్