తిరుపతి: డీడీ నెక్ట్స్‌ లెవల్ హీరో, నిర్మాతకు లీగల్ నోటీసులు

71చూసినవారు
తిరుపతి: డీడీ నెక్ట్స్‌ లెవల్ హీరో, నిర్మాతకు లీగల్ నోటీసులు
డీడీ నెక్ట్స్‌ లెవెల్ చిత్రం హీరో, నిర్మాతకు బీజేపీ నేతలు లీగల్ నోటీసులు పంపించారు. శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా పాటను పేరడీ చేశారని టీటీడీ పాలకమండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. సినిమా హీరో, నిర్మాతలు భక్తులకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని, లేదంటే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. డీడీ నెక్స్ట్ లెవెల్ చిత్రంలో గోవింద నామాలతో అసభ్యకరంగా పాటను చిత్రీకరించడం దారుణమన్నారు.

సంబంధిత పోస్ట్