తిరుపతి: ప్రేమ వ్యవహారం.. కూతురిని చంపిన తల్లి

59చూసినవారు
తిరుపతి: ప్రేమ వ్యవహారం.. కూతురిని చంపిన తల్లి
తిరుపతి జిల్లాలోని చంద్రగిరి మండలంలో నిఖిత అనే బాలిక అనుమానాస్పద స్థితిలో చనిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బాలిక మృతికి సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కూతురి ప్రేమ వ్యవహారం కారణంగానే తల్లి సుజాత నిద్రిస్తున్న నిఖితను ఊపిరాడకుండా చేసి చంపినట్లు పోలీసులు తెలిపారు. కాగా, ప్రియుడు అజయ్ తన ప్రియురాలు నికిత చేసిన చాట్ సందేశాలను ఇటీవల బయటపెట్టడంతో.. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది.

సంబంధిత పోస్ట్